మోజర్ల–మద్దిగట్ల పాఠశాలలో ఉత్తీర్ణత పత్రాల పంపిణీ.
Views: 6
On
పెద్దమందడి,ఏప్రిల్23(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల–మద్దిగట్ల పాఠశాలలో గురువారం విద్యార్థుల వార్షిక ఉత్తీర్ణత పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మోజర్ల గ్రామ సర్పంచ్ కె. చంద్రశేఖర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా 6, 7, 8, 9 తరగతుల్లో మొదటి, రెండవ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఉత్తీర్ణత పత్రాలతో పాటు బహుమతులు అందజేశారు.సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చదువుపై పోటీ తత్వం ఉండాలని, క్రమశిక్షణతో ముందుకు సాగి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కుటుంబానికి, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రామ సర్పంచ్‌గా విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎల్లప్పుడూ సహాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వరప్రసాద్ రావు ,ఉపాధ్యాయ బృందం, యువ కాంగ్రెస్ అధ్యక్షుడు డి రమేష్ యాదవ్, విద్యార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments