పుస్తకం ప్రగతికి మార్గం - శ్రీరంగాపూర్‌లో ఘనంగా ప్రపంచ పుస్తక దినోత్సవం.

పుస్తకం ప్రగతికి మార్గం - శ్రీరంగాపూర్‌లో ఘనంగా ప్రపంచ పుస్తక దినోత్సవం.

వనపర్తి,ఏప్రిల్23(తెలంగాణ ముచ్చట్లు):
 
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా  శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని గ్రంథాలయంలో గురువారం ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రంథాలయ నిర్వాహకుడు కన్నయ్య స్వామి, పుస్తక పాఠకులు కూర్మన్న, కురుమూర్తి, కవి రాఘవాచారిలను సన్మానించారు.ఈ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. పుస్తకం ప్రగతికి మార్గమని పేర్కొన్నారు. తల దించుకొని చదివితే సమాజంలో తల ఎత్తుకునేలా చేస్తుందని, పుస్తకాలు మనకు మంచి స్నేహితులని చెప్పారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు.విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని గ్రంథాలయంలో పుస్తకాలు చదవాలని కోరారు. అలాగే బి ఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణన్, మహాత్మా గాంధీ వంటి మహానుభావులు పుస్తక పఠనంతోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మండల సోషల్ మీడియా కన్వీనర్ పర్వతాలు, కూర్మన్న, కురుమూర్తి, శ్రీను, హరికృష్ణ, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .