కార్మికుల కన్నీళ్లు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అమానుషం.
ఎల్కతుర్తి మండల బిజెపి అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్.
Views: 4
On
ఎల్కతుర్తి, ఏప్రిల్ 23( తెలంగాణ ముచ్చట్లు):
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లే ఒక డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎల్కతుర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. “కార్మికుల కన్నీళ్లు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అమానుషం” అంటూ ఆయన ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు రోజురోజుకు పెరుగుతున్న ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తగిన జీతాలు లేకపోవడం, అధిక పని గంటలు, విశ్రాంతి లేకుండా విధులు నిర్వహించడం వల్ల కార్మికులు మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నారని తెలిపారు.
“వాహనాల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. సరైన ఫిట్‌నెస్ లేని బస్సులను కూడా రోడ్లపై నడపమని ఒత్తిడి చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినా బాధ్యత డ్రైవర్‌పైనే మోపుతున్నారు. ఇది పూర్తిగా అన్యాయం” అని ఆయన మండిపడ్డారు.
ఈ ఘటనకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి, కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం సరికాదన్నారు.
గాయపడిన డ్రైవర్‌కు తక్షణమే మెరుగైన వైద్యం అందించి, చికిత్స ఖర్చులను ప్రభుత్వం భరించాలని, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అలాగే ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లైన వేతన సవరణలు, బకాయిల చెల్లింపులు, పని గంటల నియంత్రణ, ఉద్యోగ భద్రత వంటి అంశాలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ తరఫున పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన వాతావరణం నెలకొంది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
23 Apr 2026 21:51:28
వనపర్తి,ఏప్రిల్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన మహనీయుడు భగీరథ మహర్షి అని నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి...


Comments