రోడ్లే మాయం… అక్రమ నిర్మాణాలతో 7వ వార్డు వాసులకు నరకయాతన.
పన్నుల వసూళ్లలో చురుకుదనం… సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం.
Views: 30
On
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలోని 7వ వార్డులో అక్రమ నిర్మాణాలు విస్తరించి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రహదారులను ఆక్రమిస్తూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతో కాలనీల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఒకప్పుడు సౌకర్యంగా ఉన్న వీధులు ఇప్పుడు కుచించుకుపోయి, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు, ఆటోలు సైతం లోపలికి చేరలేని పరిస్థితి ఏర్పడింది.
స్థానికులు చెబుతున్నదాని ప్రకారం, ఎవరైనా మరణించిన సందర్భంలో వైకుంఠ రథం కూడా కాలనీలోకి రాలేని దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ప్రజలలో భయాందోళనలు కలిగిస్తోంది.
పన్నుల వసూళ్లలోనే ఉత్సాహం… చర్యల్లో నిష్క్రియత
మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లలో చూపుతున్న చురుకుదనం, అక్రమ నిర్మాణాల తొలగింపులో కనిపించడం లేదని కాలనీవాసులు మండిపడుతున్నారు. పన్నులు వంద శాతం వసూలు చేస్తున్నప్పటికీ, రహదారుల ఆక్రమణలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
మున్సిపల్ కమిషనర్ వ్యవహారశైలిపై కాలనీల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ప్రాణ భద్రతకు ముప్పుగా మారిన ఆక్రమణలను తక్షణమే తొలగించి, రాకపోకలకు మార్గం సుగమం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments