అరైవ్ అలైవ్ కార్యక్రమంలో రోడ్డు గుంతల పూడ్చివేత

అరైవ్ అలైవ్ కార్యక్రమంలో రోడ్డు గుంతల పూడ్చివేత

_జిహెచ్ఎంసి–జవహర్ నగర్ పోలీసుల సంయుక్త చర్యలు, 

_ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం

జవహర్ నగర్, ఏప్రిల్ 13 (తెలంగాణ ముచ్చట్లు):

రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం 4వ దశలో భాగంగా జవహర్ నగర్ చెన్నాపురం సమీప ప్రాంతాల్లో రోడ్డు గుంతల పూడ్చివేత చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి మరియు జవహర్ నగర్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రమాదాలకు కారణమవుతున్న గుంతలను గుర్తించి వెంటనే పూడ్చివేయడం ద్వారా వాహనదారులకు సౌకర్యం కల్పించడమే కాకుండా, రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, వేగ పరిమితులను పాటించడం వంటి అంశాలపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. రోడ్డు భద్రతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు, అడ్మిన్ ఎస్సై రాము నాయక్, జిహెచ్ఎంసి సిబ్బంది సందీప్, నవీన్ గౌడ్ పాల్గొన్నారు. అలాగే కాలనీ నివాసులు బిరు ఏక స్వామి, సరిత, సుప్రియ తదితరులు హాజరై కార్యక్రమానికి సహకరించారు.IMG-20260413-WA0074

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .