ఆయిల్ ఫామ్ పంటతో అధిక లాభాలు
రైతులకు అవగాహన కల్పించిన అధికారులు.
Views: 9
On
పెద్దమందడి,ఏప్రిల్24(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలోని రైతు వేదికలో ఆయిల్ ఫామ్ పంట సాగు ద్వారా లభించే లాభాలపై రైతులకు వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు పాల్గొని ఆసక్తి చూపారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి రామాంజనేయులు మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ పంట సాగు రైతులకు దీర్ఘకాలికంగా మంచి ఆదాయాన్ని అందించే పంటగా నిలుస్తుందని తెలిపారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందే అవకాశముందని, సరైన పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని వివరించారు.ఉద్యానవన శాఖ అధికారి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం పలు రకాల సబ్సిడీలు, సాంకేతిక సహాయం అందిస్తున్నదని చెప్పారు.రైతులు ఈ అవకాశాలను వినియోగించుకుని తమ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.అలాగే, ఆయిల్ ఫామ్ పంట సాగులో అనుసరించాల్సిన విధానాలు, నీటి నిర్వహణ, ఎరువుల వినియోగం, వ్యాధి నియంత్రణ వంటి అంశాలపై రైతులకు వివరంగా తెలియజేశారు. రైతులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు.ఈ కార్యక్రమం ద్వారా రైతుల్లో ఆయిల్ ఫామ్ పంటపై అవగాహన పెరిగి, సాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి రామాంజనేయులు, ఉద్యానవన అధికారి విజయ్ భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్, జోనల్ మేనేజర్ రాకేష్, ఏరియా మేనేజర్ కేతన్ రెడ్డి, ఆయిల్ ఫామ్ ఫీల్డ్ ఆఫీసర్ ఉదయ్, ఏఈఓ, చెన్నారాయుడు, రైతులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments