కాలేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కుట్రలు విఫలం
బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్
Views: 3
On
ఎల్కతుర్తి, ఏప్రిల్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరితమని, వాటికి హైకోర్టు తీర్పు గట్టి సమాధానమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్ అన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేస్తున్న ప్రచారం పీసీ ఘోష్ నివేదికతో పూర్తిగా తేలిపోయిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించేందుకు చేసిన ప్రయత్నమని విమర్శించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ అసత్య ప్రచారాలకు చెక్ పెట్టిందని, ప్రతిపక్షాల రాజకీయ కుట్రలు విఫలమయ్యాయని తెలిపారు.
ఈ సందర్భంగా సింగిల్ విండో మాజీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఒక బ్యారేజ్ కాదని, మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థలు, సుమారు 250 మీటర్ల సొరంగంతో కూడిన విస్తృత ప్రాజెక్టు అని వివరించారు. మొత్తం 300 పిల్లర్లలో కేవలం రెండు పిల్లర్లకు పాక్షిక పగుళ్లు వచ్చినందుకు ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని ప్రచారం చేయడం దురుద్దేశపూరితమని అన్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇటీవల జరిగిన శంకర్ గౌడ్ ఘటనను ప్రస్తావిస్తూ, బాధిత కుటుంబానికి రూ.1 కోటి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యుడికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీపతి రవీందర్ గౌడ్, మేకల స్వప్న, తంగెడ నగేష్, కడారి రాజు, తంగెడ మహేందర్, గోల్లే మహేందర్, గుండేటి సతీష్, మదార్, మునిగడప లావణ్య, శేషగిరి, భాషా, బోయిన నీలా, కొమురయ్య యాదవ్, దుగ్యాని సమ్మయ్య, చెవుల కొమరయ్య, ఎర్రబెల్లి సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
24 Apr 2026 22:14:04
ఎల్కతుర్తి, ఏప్రిల్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరితమని, వాటికి హైకోర్టు తీర్పు గట్టి సమాధానమని బీఆర్ఎస్...


Comments