బ్రెయినీ స్టార్స్ మాంటెస్సోరి స్కూల్‌లో ఘనంగా ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.

బ్రెయినీ స్టార్స్ మాంటెస్సోరి స్కూల్‌లో ఘనంగా ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.

ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 25(తెలంగాణ ముచ్చట్లు )

ఖమ్మం సహకార నగర్‌లోని బ్రెయినీ స్టార్స్ మాంటెస్సోరి స్కూల్‌లో ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో ఆనందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్  జైనుల్ పాషా  ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ, విద్య అనేది పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది అని, చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు, విలువలు అలవరచుకోవాలని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, వారిని మరింత ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కలసి సహకరించాలని ఆయన తెలిపారు.

ఈ వేడుకల్లో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, పాటలతో అందరిని అలరించారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యనిలు ఉజ్మా, శైలజ, సునీత, ప్రశాంతి, నీలిమ, మాధవి, నాగమణి, నగిన, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .