మోజర్లలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం .
Views: 7
On
పెద్దమందడి,ఏప్రిల్27(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ కే చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన వరికి సరైన ధర లభించేలా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు.రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ధాన్యాన్ని విక్రయించుకునేలా సౌకర్యాలు కల్పించామని, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందిస్తున్న పథకాల ప్రయోజనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కొత్త కాపు రామకృష్ణారెడ్డి, మోజర్ల ఉప సర్పంచ్ ఆర్ రాములు, మద్దిగట్ల గ్రామ సర్పంచ్ ఎం రాములు, ఉప సర్పంచ్ రవి, పెద్దమందడి సింగిల్ విండో ప్రతినిధులు జగదీశ్వర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, సత్య రెడ్డి, వెంకటస్వామి, భగవంతు రెడ్డి, సింగం కృష్ణయ్య, మేకల రాములు, ఆడం ఆంజనేయులు, కావల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments