గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.

ఇందిరమ్మ ఇళ్ల పనుల పరిశీలన – సమస్యల పరిష్కారానికి హామీ.

గిరిజన గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.

దమ్మపేట, ఏప్రిల్‌ 26(తెలంగాణ ముచ్చట్లు):
 
మండలంలోని మారుమూల కొండరెడ్డ్ల గిరిజన గ్రామాలైన పూసుకుంట, కట్కూరులో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించి, పురోగతిపై అధికారులకు సూచనలు చేశారు. అలాగే స్థానిక పాఠశాలలో నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ పనులను కూడా ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాట్ల రాజిరెడ్డి, ఉపసర్పంచ్ కోండ్రు బాబురావు, మడకం రాజేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.IMG-20260426-WA0070
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .