పాముకాటుతో మూడేళ్ల బాలుడు మృతి

పాముకాటుతో మూడేళ్ల బాలుడు మృతి

ఎల్కతుర్తి, ఏప్రిల్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
 
మండలంలోని దామేర గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పాముకాటుతో మూడేళ్ల బాలుడు మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
స్థానిక ఎస్సై ఇ. నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం, దామేర గ్రామానికి చెందిన వంగ అనిల్, అనిత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం చిన్న కుమారుడు మనవిత్ యాదవ్ (3) ఇంటి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పాము కాటు వేసింది. కాటు వేసిన విషయాన్ని బాలుడు తల్లికి తెలియజేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించాలని సూచించారు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా, సిబ్బంది వేగంగా స్పందించి బాలుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు పరిశీలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనతో బాలుడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న వయస్సులోనే బాలుడు ప్రాణాలు కోల్పోవడం గ్రామస్తులను తీవ్ర దిగ్రాంతికి గురి చేసింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .