ప్రపంచ శిల్ప కళా దినోత్సవం సందర్భంగా సాంప్రదాయ శిల్పులకు ఘన సన్మానం

ప్రపంచ శిల్ప కళా దినోత్సవం సందర్భంగా సాంప్రదాయ శిల్పులకు ఘన సన్మానం

వనపర్తి,ఏప్రిల్26(తెలంగాణ ముచ్చట్లు):
 
 ప్రపంచ శిల్ప కళా దినోత్సవాన్ని  పురస్కరించుకుని సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో ఆదివారం సాంప్రదాయ శిల్పులకు ఘన సన్మానం నిర్వహించారు.వంశపారంపర్యంగా శిల్పకళను కొనసాగిస్తూ శిల, దారు, సిమెంట్‌లలో దేవతా విగ్రహాలను రూపొందిస్తున్న బైరోజు చంద్రశేఖర్, డా. బైరోజు శ్యాంసుందర్ సోదరులను వారి స్వగృహంలో సన్మానించారు.ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. లలిత కళలలో శిల్పకళకు ప్రత్యేక స్థానం ఉందని, అలాంటి అరుదైన కళను పరిరక్షించి కొనసాగించడం సమాజం బాధ్యత అని అన్నారు. వృత్తిరీత్యా తెలుగు భాష ఉపాధ్యాయులైన బైరోజు సోదరులు తమ తీరిక సమయాల్లో శిల్పాలను రూపొందిస్తూ కళను సజీవంగా ఉంచుతున్నారని ప్రశంసించారు.ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు కర్నూలు, నల్గొండ, అదిలాబాద్ ప్రాంతాలలోని అనేక దేవాలయాలకు వీరు తయారు చేసిన విగ్రహాలు ప్రత్యేక గుర్తింపు పొందాయని తెలిపారు. వీరి శిల్పకళా సేవలను గుర్తించి తెలుగు విశ్వవిద్యాలయం వంటి సంస్థలతో పాటు చిన్నజీయర్ స్వామి, విద్యా నృసింహభారతి, సిద్ధిలింగ మహాస్వామి వంటి ఆధ్యాత్మిక గురువులు కూడా వివిధ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలలో సన్మానించినట్లు ఆయన గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో రామన్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ దేశి రాములు యాదవ్, గోపాలపేట ఎంఈఓ ఎస్. చంద్రశేఖర్, సామాజికవేత్త గంధం నాగరాజు, బండారు శ్రీనివాస్, బుచ్చిబాబు, శ్రీనివాస్, సాయి దరహాస్ తదితరులు పాల్గొన్నారు.శిలకు ప్రాణం పోసే శిల్పుల సేవలను సమాజం గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .