ఆర్ ఎస్ విమర్శలు సిగ్గుచేటుకొలిపాక సతీష్.

ఆర్ ఎస్ విమర్శలు సిగ్గుచేటుకొలిపాక సతీష్.

స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 25 (తెలంగాణ ముచ్చట్లు): 
 
 బి ఆర్ ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బాధ్యులు కొలిపాక సతీష్ విమర్శించారు.
ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ సమస్యలను కేవలం మూడు రోజుల్లోనే పరిష్కరించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమైందన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, సంఘాల ఎన్నికలు నిర్వహించడం, 11 శాతం వేతన సవరణ ప్రకటించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా నెరవేరని కార్మిక సంఘాల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించిందన్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వ కాలంలో ఆర్టీసీ కార్మికులు దాదాపు 55 రోజుల పాటు ఆందోళనలు చేపట్టారని గుర్తు చేశారు. ఆ సమయంలో పలువురు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలను ప్రస్తావిస్తూ, వాటికి బాధ్యత ఎవరిదో బి ఆర్ ఎస్ నాయకులు చెప్పాలని ప్రశ్నించారు.
సమ్మెలో పాల్గొన్న వేలాది కార్మికులను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోబోమని ప్రకటించడం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమని చెప్పడం, ప్రైవేటీకరణకు ప్రయత్నించడం వంటి విషయాలను ప్రజలు మర్చిపోలేదన్నారు. మహిళా కార్మికులపై కేసులు నమోదు చేయడం, లాఠీచార్జ్ చేయించడం వంటి ఘటనలు కూడా జరిగాయని ఆరోపించారు.
అప్పుడు ఆర్టీసీ నిర్వహణకు నెలకు వందల కోట్లు అవసరమని చెప్పి చేతులెత్తేసిన ప్రభుత్వం, ఇప్పుడు విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేసిందని చర్చలు జరిపిన 13 గంటల్లోనే సమస్య పరిష్కార దిశగా పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నెరవేరిందని పేర్కొన్నారు.
 
ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ పొన్న రవి, సామాజిక మాధ్యమాల బాధ్యులు మామిడ్ల శ్రీనివాస్, మాజీ మండల పరిషత్ సభ్యులు రమేష్, గట్టు కోటి, జంపాల శ్రీనివాస్, మైనార్టీ నాయకులు ఖలీమ్, గట్టు శివ, తాళ్లపల్లి కుమార్, గట్టు రంజిత్, ఏలీయా, వీరస్వామి, సందీప్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .