కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆగమైపోతుంది .

కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆగమైపోతుంది .

తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ ఆవేదన 
 
ఖమ్మంలో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం 
 
ఖమ్మం బ్యూరో,ఏప్రిల్ 25 (తెలంగాణ ముచ్చట్లు )
 
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ నేడు ఆగమైపోతుందని, కెసిఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ కబంధహస్తాల్లో చిక్కుకుందని అటువంటి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ  కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు.
 
ఖమ్మం నగరంలోని మామిళ్ల గూడెంలో తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ జిల్లా నూతన కార్యాలయాన్ని  కపిలవాయి దిలీప్ కుమార్ శనివారం అట్టహసంగా ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమాలలో ఆనాడు చురుకైన పాత్రను తను పోషించానని, కెసిఆర్ తో కలిసి  చేసిన ఉద్యమాలు రాష్ట్రంలో ఉవ్వెత్తిన ఎగిసి పడిందని గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యారని, ఉద్యమ సమయంలో దళితుడే ముఖ్యమంత్రి అని ప్రకటించిన కేసీఆర్ దళితులకు ఇవ్వకుండా తానే ముఖ్యమంత్రిగా ఉండి దళితులకు ఇచ్చిన మాట తప్పి కుటుంబ పాలన కొనసాగించాడని విమర్శించారు. కెసిఆర్ పాలనలో ఈ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందకుండా ఆగమై పోయిందని ఆరోపించారు. 
 
ఇందిరమ్మ రాజ్యం అంటూ రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్న పాలన ప్రజాభీష్టం మేరకు కొనసాగించాలని, ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తే ఏ  ప్రభుత్వం అయినా ఎల్లకాలం కొనసాగలేవని అన్నారు. 
 
రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను తమ పార్టీ నిశితంగా పరిశీలిస్తుందని, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రజలు తమ పార్టీని ఆదరించి మరింత ముందుకు కొనసాగించేందుకు తమ సహాయ సహకారాలు అందించి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు .
 
ఈ కార్యక్రమంలో  తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీరప్ప, కోశాధికారి కె .గిరీష్, యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ విక్రమ్ శర్మ, సూర్యాపేట అధ్యక్షులు డాక్టర్   సోమ గాని నరేందర్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు జానీ మహమ్మద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం వెంకటేశ్వర చారి, స్టేట్ సెక్రెటరీ ఎన్. భాస్కరరావు, ఆర్ ఎల్ డి స్టేట్ జనరల్ సెక్రెటరీ సుధాకర్ యాదవ్, స్టేట్ జనరల్ సెక్రెటరీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

ఖచ్చిత గణన లక్ష్యంగా జమ్మికుంటలో సెన్సెస్-2027 శిక్షణ తరగతులు ప్రారంభం. ఖచ్చిత గణన లక్ష్యంగా జమ్మికుంటలో సెన్సెస్-2027 శిక్షణ తరగతులు ప్రారంభం.
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 25 (తెలంగాణ ముచ్చట్లు):   జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెన్సెస్-2027 గృహ గణనకు సంబంధించి శిక్షణ తరగతులు శనివారం ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న...
ఆధ్యాత్మిక సందేశాలతో అలరించిన హిందూ సమ్మేళనం
పోలీస్ స్టేషన్ ఆవరణలో కోతుల సందడి.
హుజురాబాద్‌లో ఆర్టీసీ బస్సుల రాకతో ప్రయాణికుల హర్షం.
రాష్ట్ర శిక్షణతో ఉద్యమాలకు కొత్త ఉత్సాహం
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.
ఆర్ ఎస్ విమర్శలు సిగ్గుచేటుకొలిపాక సతీష్.