స్వీయ కథా రచన పోటీల్లో శ్రీ ఆదర్శ విద్యార్థుల ప్రతిభ
Views: 7
On
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 26(తెలంగాణ ముచ్చట్లు )
తెలంగాణ సాహిత్య అకాడమీ- ఖమ్మం ట్రస్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కథా కార్యశాల స్వీయ కథా రచన పోటీల్లో నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యార్థులు అత్యధిక ప్రతిభ కనబరిచారు. జిల్లాస్థాయిలో విద్యార్థుల్లో సృజనాత్మక కథారచనకు సంబంధించిన మెలుకువలు నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఖమ్మంలో శని, ఆదివారాల్లో నిర్వహించారు. ఈ స్వీయ కథా రచన పోటీల్లో జిల్లాలోని పలు పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయానికి చెందిన విద్యార్థులు నున్నా రుషిత, మోదుగుల హాసిని, కణతాల సాయి వర్షిని ఈ కథ రచన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా విజేతలు ప్రముఖ కథా రచయిత నామిని సుబ్రమణ్యం నాయుడు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గుర్రం కాంతారావు, ప్రముఖ విద్యావేత్త, ఫెమా రాష్ట్ర కన్వీనర్ మువ్వ శ్రీనివాసరావు, ఐవీ రమణారావు చేతుల మీదుగా విద్యార్థులు ప్రతిభా పురస్కారం, బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ బోడేపుడి కిరణ్, ప్రిన్సిపల్ చావా అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments