కన్యకా పరమేశ్వరి ఆశయాలు అందరికీ ఆదర్శం

చైర్మన్ ప్రశాంత్ కుమార్

కన్యకా పరమేశ్వరి ఆశయాలు అందరికీ ఆదర్శం

 
IMG-20260426-WA0050
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 26 (తెలంగాణ ముచ్చట్లు):
 
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి సందర్భంగా పట్టణంలో భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ఆలయానికి విచ్చేసి ప్రత్యేక హోమంలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి పట్టు చీరలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తదుపరి స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో కూడా చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమేకాక, సమాజానికి ఆదర్శంగా నిలిచిన వీరనారి అని కొనియాడారు. అమ్మవారి ఆశయాలు ధర్మం, న్యాయం, సేవ అనే విలువలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.
జమ్మికుంట పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంతాల వారు అమ్మవారి ఆశయ సాధనలో భాగస్వాములై సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బచ్చు మాధవి శివశంకర్, చందరాజు, స్వామిశెట్టి అఖిలాండం రాజేందర్, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .