అధికారుల నిర్లక్ష్యం… వర్షానికి తడిసిన ధాన్యం

రైతుల నష్టానికి ఎవరు బాధ్యులు?

అధికారుల నిర్లక్ష్యం… వర్షానికి తడిసిన ధాన్యం

వేలేరు, ఏప్రిల్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
 
వేలేరు మండలం పీచర గ్రామంలో ఐకేపి సెంటర్లలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. సోమవారం కురిసిన వర్షంతో రైతులు కష్టపడి ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిముద్దవగా, దీనికి కారణం కొనుగోళ్లు ప్రారంభించకుండా కాలయాపన చేసిన సంబంధిత అధికారులే అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెంటర్ ప్రారంభించి మూడు రోజులు గడిచినా ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సుమారు 25 మంది రైతులకు భారదాన్ ఇచ్చి సంచుల్లో నింపించిన ధాన్యాన్ని కూడా తరలించకపోవడం అధికారుల పనితీరుపై అనుమానాలు రేకెత్తిస్తోంది.
వర్షం పడే సూచనలు ఉన్నప్పటికీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా  అధికారులు వర్షాలు వచ్చేసమాయానికి రైతులకు ఉపయోగపడేలా ఐ కే పి నిర్వాహకులకు 25 నుండి 30 పరదాలను ఇచ్చినట్లు చెపుతున్నారు కానీ రైతులు ఇవ్వమని అడిగితె ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టి డంపింగ్ చేయాలని చెప్పడం రైతులపై ద్వంద్వభారం మోపినట్టే అవుతోంది.
ఇలా రైతులు నష్టపోతుంటే అధికారులు మాత్రం చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తుండడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని లేకపోతే ఆందోళనలు తప్పవని రైతులు హెచ్చరిస్తున్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .