హుజురాబాద్‌లో కూరగాయల అమ్మకాలు బంద్

డంపు యార్డు వ్యతిరేకంగా నిరసనలు ఉధృతం.

హుజురాబాద్‌లో కూరగాయల అమ్మకాలు బంద్

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 27 (తెలంగాణ ముచ్చట్లు ):
 
హుజురాబాద్ పట్టణంలో కూరగాయల వ్యాపారస్తులు, రైతులు సోమవారం ఉదయం నుంచి కూరగాయల అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు. హుజురాబాద్ శివారులోని సిర్సపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న డంపు యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన దీక్ష సోమవారానికి 36వ రోజుకు చేరుకుంది.
ఈ నిరసనలకు మద్దతుగా కూరగాయల వ్యాపారస్తులు, రైతులు వినూత్నంగా స్పందించారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూరగాయల విక్రయాన్ని బంద్ చేసి తమ ఐక్యతను చాటారు. దీంతో పట్టణంలో కూరగాయల మార్కెట్లు మూతపడ్డాయి.
డంపు యార్డు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ స్థలాన్ని ఎంపిక చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ప్రజలు, రైతులు, వ్యాపారస్తులు కలిసి చేపట్టిన ఈ నిరసన ఉద్యమం మరింత ఉధృతమవుతోంది.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .