జమ్మికుంటలో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా
జెండా ఆవిష్కరణల్లో మున్సిపల్ చైర్మన్.
Views: 2
On
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జమ్మికుంట పట్టణం ఉత్సాహభరితంగా మారింది. ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని 23, 12వ వార్డుల్లో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.
కార్యక్రమం సందర్భంగా పార్టీ కార్యకర్తలు నినాదాలతో సందడి చేయగా, పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు స్థాపించిన బీఆర్‌ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. “ఆనాడు కేసీఆర్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాల వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది” అని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని, భవిష్యత్తులో కూడా అదే దిశగా ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు. జమ్మికుంట ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ ఆశయాలను ప్రజల్లో మరింత బలంగా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చుంచూ రమాదేవి, వార్డు అధ్యక్షులు పసునూటి శ్రీకాంత్, నాగపురి శ్రీనివాస్,
ఉడుత రమేష్, ఎండీ అమీర్, దేవరాజు నదీమ్, జాఫర్, నజీర్, ఖాజా, శివ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
ఉడుత రమేష్, ఎండీ అమీర్, దేవరాజు నదీమ్, జాఫర్, నజీర్, ఖాజా, శివ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.Tags:
Related Posts
Post Your Comments
Latest News
27 Apr 2026 22:27:38
వేలేరు, ఏప్రిల్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం పీచర గ్రామంలో ఐకేపి సెంటర్లలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. సోమవారం కురిసిన వర్షంతో రైతులు కష్టపడి...


Comments