చెరువుల్లో గుర్రపు డెక్కతో దోమల సమస్య తీవ్రం
_జోనల్ కమిషనర్‌కు సాయిజెన్ వినతి
– పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు
నాచారం, ఏప్రిల్ 13 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలోని హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు, పటేల్ కుంట చెరువుల్లో విపరీతంగా గుర్రపు డెక్క (వాటర్ హైసింత్) పెరగడంతో దోమల సమస్య తీవ్రమైంది. ఇప్పటికే గుర్రపు డెక్క తొలగింపు పనులకు రూ.1.20 కోట్ల నిధులు మంజూరై రెండు నెలలు గడిచినా, పనులు ప్రారంభం కాలేదని బారాస రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.అధికారుల నిర్లక్ష్యం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని ఆయన ఆరోపిస్తూ, తక్షణమే గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ విషయంపై స్పందించిన జోనల్ కమిషనర్ సంబంధిత అధికారులతో మాట్లాడి, వెంటనే పటేల్ కుంట చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులు ప్రారంభించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కట్ట బుచ్చన్న గౌడ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


Comments