రైతుల కోసం పోరాటం మరింత వేగం..!

రాష్ట్ర కమిటీలోకి సంపత్ రావు

రైతుల కోసం పోరాటం మరింత వేగం..!

జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
 
తెలంగాణ రైతు ఉద్యమానికి మరో బలమైన స్వరం జతైంది. మండలంలోని అంకుషాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బాసిర సంపత్ రావు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషంగా నిలిచింది.
కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈనెల 23, 24, 25 తేదీల్లో జరిగిన తెలంగాణ రైతు సంఘం మూడవ మహాసభల్లో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకోగా, అందులో సంపత్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు. గత 30 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూనే ఆదర్శ రైతుగా గుర్తింపు పొందిన ఆయన, రైతాంగ సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూ రైతుల గళంగా నిలిచారు.
ఈ సందర్భంగా సంపత్ రావు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్, కార్యదర్శి తీగల సాగర్, జిల్లా అధ్యక్షుడు వర్ణ వెంకటరెడ్డి, కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత గట్టిగా పోరాడతానని స్పష్టం చేసిన ఆయన, జిల్లావ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్‌లోని హామీలను అమలు చేయాలని కోరారు.
“రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదు” అంటూ రైతుల కష్టాలను గుర్తు చేసిన సంపత్ రావు, సరళీకృత ఆర్థిక విధానాల వల్ల రైతుల పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో, వాటి నివారణకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన కార్యాచరణ తీసుకురావాలని డిమాండ్ చేశారు.
అలాగే 55 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు పెన్షన్ ఇవ్వాలని, చిన్న మరియు సన్నకారు రైతులకు ఉచితంగా ఎరువులు, పురుగుమందులు అందించాలని, పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.
జిల్లాలో తెలంగాణ రైతు సంఘాన్ని మరింత బలోపేతం చేసి రైతులకు అండగా నిలుస్తామని సంపత్ రావు హామీ ఇచ్చారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

బలిదుపల్లి మహిళా సంఘంలో అవినీతి ఆరోపణలు. బలిదుపల్లి మహిళా సంఘంలో అవినీతి ఆరోపణలు.
    అడ్డాకల్, ఏప్రిల్29(తెలంగాణ ముచ్చట్లు): మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని బలిదుపల్లి గ్రామ మహిళా సంఘంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ గ్రామానికి చెందిన 5వ వార్డు సభ్యుడు ఆంజనేయులు
హుజురాబాద్‌లో అమరవీరుల స్మారక బ్యారక్ ప్రారంభం .
హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్‌పై రాజకీయ తుపాన్ .
పదవ తరగతి ఫలితాల్లో నారాయణ స్కూల్ విజయకేతనం.
సీఆర్‌పీలకు బదిలీలు చేపట్టాలి.
చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది .
వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అయినా...ధాన్యం కొనుగోలు నత్తనడక .