చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది .

మార్కెట్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి.

చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది .

పెద్దమందడి,ఏప్రిల్28(తెలంగాణ ముచ్చట్లు):
 
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఐకెపి కేంద్రాల ద్వారా వడ్ల కొనుగోలు కార్యక్రమాన్ని స్థానిక గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వనపర్తి వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు.అదేవిధంగా రైతులు తేమశాతం తగ్గే వరకు వడ్లను బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోందన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాజీ సింగిల్ విండో చైర్మన్ సత్యరెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెంకటస్వామి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గట్టు యాదవ్, ఏపీఎం సకృ నాయక్, కేంద్ర నిర్వాహకులు శారద, అరుణ, మాధవి తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .