దేవస్థానం నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం..!
రోడ్డెక్కిన హనుమాన్ భక్తులు.
Views: 16
On
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
ఇల్లంతకుంట దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంపై హనుమాన్ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ, ఇల్లందకొండ చౌరస్తాలో రోడ్డుపై నిరసన చేపట్టారు.
భక్తులు మాట్లాడుతూ, ఆలయంలో కనీస వసతులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని, తాగునీటి వంటి ప్రాథమిక సదుపాయాలు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, భక్తులపై అదనపు బిల్లులు మోపుతూ అవినీతి జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
దేవస్థానం అధికారులు భక్తుల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించిన భక్తులు, వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని భక్తులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. సమస్యలను చట్టపరంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, భక్తులను శాంతింపజేసి నిరసనను విరమింపజేశారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments