పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు.

పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు.

- నిల్వలపై ఆందోళన అవసరం లేదు: పోలీస్ కమిషనర్ సునీల్ దత్.

సత్తుపల్లి, ఏప్రిల్ 28(తెలంగాణ ముచ్చట్లు):

జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఇంధన బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరత సృష్టించే చర్యలపై పోలీసు శాఖ నిఘా కొనసాగుతోందన్నారు.
బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఉన్నప్పటికీ లేదని చెప్పడం, అధిక ధరలకు విక్రయించడం వంటి ఘటనలు గమనించినట్లయితే, వెంటనే పౌరసరఫరాల శాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అపోహలు నమ్మి ఇంధనాన్ని అధికంగా నిల్వ చేసుకోవద్దని, అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని ప్రజలను కోరారు. జిల్లాలో ఇంధన సరఫరా సజావుగా కొనసాగుతోందని, ఎటువంటి అంతరాయం లేకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .