మే డేకు హుజురాబాద్ సిద్ధం.

కార్మిక హక్కుల కోసం పోరాటానికి పిలుపు.

మే డేకు హుజురాబాద్ సిద్ధం.

హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
 
హుజురాబాద్ మండలంలో మే డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో కదిరే రమేష్ అధ్యక్షతన మంగళవారం స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మే డేను వైభవంగా జరపాలని నిర్ణయించారు.
సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, 1886లో చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో కార్మిక వర్గం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకున్న చారిత్రక పోరాటాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు.
బీజేపీ కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను దెబ్బతీస్తోందని విమర్శించారు. వెంటనే ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రతి కార్మికుడికి కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. అన్ని రంగాల కార్మికులకు సమాన హక్కులు కల్పించాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో సిఐటియు మండల కమిటీ సభ్యులు కొంకట చంద్రయ్య, ప్రతాప్ శ్రీనివాస్, తాడూరి లత, ఇమ్మడి శ్రీకాంత్, కొలుగూరి కుమార్, మోరే మహేష్, వెంకటేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .