జమ్మికుంటలో నీటి ఎద్దడికి నోచాన్స్..!

ఎండలపై ముందస్తు యుద్ధం ప్రకటించిన చైర్మన్

జమ్మికుంటలో నీటి ఎద్దడికి నోచాన్స్..!

జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
 
ఎండాకాలం ముదురుతున్న వేళ జమ్మికుంట పట్టణ ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్. మిషన్ భగీరథ డీఈతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పట్టణంలో నీటి సరఫరా పరిస్థితులను సమగ్రంగా సమీక్షించారు.
“ప్రజలకు ఒక్క చుక్క నీరు కూడా కొరత లేకుండా సరఫరా చేయడం మన బాధ్యత” అని చైర్మన్ స్పష్టం చేశారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి వార్డులో నీటి సరఫరా నిరంతరంగా కొనసాగాలని, ఎక్కడైనా అంతరాయం కలిగితే వెంటనే పరిష్కరించాలని అధికారులను కఠినంగా ఆదేశించారు.
పైప్‌లైన్ లీకేజీలు, మోటార్ లోపాలు, నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సమస్యలను నిర్లక్ష్యం చేస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యమని, అందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, మిషన్ భగీరథ ఏఈ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .