కార్యకర్తలే పార్టీ శక్తి శిక్షణ శిబిరాల్లో స్పష్టమైన సందేశం
Views: 10
On
ఎల్కతుర్తి, ఏప్రిల్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కొత్తకొండ గ్రామంలో గల బి ఆర్ కే ఫంక్షన్ హాల్‌లో “పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ - 2026” పేరిట బీజేపీ నియోజకవర్గ స్థాయి రెండు రోజుల శిక్షణ శిబిరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున సిద్దిపేట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వందేమాతరం గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా జరిగిన ప్రధాన సెషన్‌లో “అంత్యోదయ ద్వారా సంతృప్తత - కేంద్ర ప్రభుత్వ పథకాలు” అనే అంశంపై ప్రసంగిస్తూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేర్చాలని సూచించారు.
మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన జరిగిన మరో సెషన్‌లో కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పాల్గొని, పార్టీ బలోపేతానికి కార్యకర్తలు అనుసరించాల్సిన విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా వివరించారు. శిక్షణ శిబిరం రెండో రోజు రాష్ట్ర స్థాయి వక్తలు వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రావు అమరేందర్ రెడ్డి, ముగా జయశ్రీ పాల్గొన్నారు. రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ నాయకులతో పాటు మండల అధ్యక్షులు, మండల నాయకులు, బూత్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు మరియు పార్టీ క్రియాశీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొదటి రోజు శిక్షణ తరగతులు జాతీయ గీతాలాపనతో ముగిశాయి.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments