సిబ్బందికి భద్రత ఎక్కడ..?
జమ్మికుంటలో మున్సిపల్ ఉద్యోగుల నిరసన
Views: 13
On
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
మున్సిపల్ సిబ్బందిపై దాడి ఘటనపై జమ్మికుంటలో ఆగ్రహం చెలరేగింది. మున్సిపాలిటీ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జిలు ధరించి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డ వ్యక్తిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆదేశాల మేరకు, మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది. “ప్రజాసేవలో ఉన్న సిబ్బందిపై దాడులు అసలు సహించం” అంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మేనేజర్ రాజిరెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కార్పొరేటర్ భర్త సానిటరీ ఇన్స్పెక్టర్‌పై దాడి చేయడం తీవ్రంగా ఖండనీయమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మున్సిపల్ సిబ్బంది భద్రతకు హామీ ఇవ్వాలని, విధుల్లో భయంలేకుండా పనిచేసే వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో సీనియర్ అసిస్టెంట్ వాణి, భాస్కర్, శ్రీనివాస్, వార్డ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments