కాలసూచిక ఆవిష్కరణతో సంప్రదాయానికి కొత్త వెలుగు.
Views: 2
On
ఎల్కతుర్తి, ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో త్రైత శకం–48 కాలసూచికను ఘనంగా ఆవిష్కరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ నరసింహారావు చేత ఈ కాలసూచిక విడుదల కావడం విశేషం. కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఇందు జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి ఎల్కతుర్తి శాఖ అధ్యక్షుడు సదానిరంజన్ సిద్ధాంతి ఎస్‌ఐ నరసింహారావును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమం ద్వారా సంప్రదాయ కాలమానం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యాన్ని ప్రతిపాదించారు.
ఎస్‌ఐ నరసింహారావు మాట్లాడుతూ త్రైత శకం–48 కాలసూచికలో ఆధ్యాత్మిక అంశాలను సమగ్రంగా, సులభమైన భాషలో అందించారని తెలిపారు. ఇందులో శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు అందించిన జ్ఞానం విశదంగా వివరించబడిందని పేర్కొన్నారు.
జీవాత్మ, ఆత్మ, పరమాత్మల విశిష్టతలను సులభంగా అర్థమయ్యే విధంగా వివరించడమే కాకుండా “యుగాది” అనే పదం “ఉగాది”గా ఎలా మారిందో స్పష్టంగా చెప్పిన విధానం ప్రశంసనీయం అని తెలిపారు. అలాగే చైత్రమాసం నుండి ఫాల్గుణమాసం వరకు తెలుగు సంప్రదాయ కాలమానాన్ని ప్రతిబింబించేలా ఈ కాలసూచిక రూపొందించబడినందుకు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సదానిరంజన్ సిద్ధాంతి, శ్రీరామోజు సతీష్ చారి, ప్రవీణ్, రాములు, రాకేష్, స్రవంతి, రాణి, క్షేత్రగ్న, దివిజ, తనుష, ఋషి, మోక్షజ్ఞ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
01 May 2026 18:32:58
హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లీ 14వ వార్డుకు చెందిన సటికం సారయ్య గారి తల్లి సటికం నర్సమ్మ గారు వడదెబ్బకు గురై ఈ...


Comments