సమాజ సేవకు గుర్తింపు...అడ్వకేట్ శ్రీనివాస్‌కు దళిత రత్న.
Views: 6
On
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మున్సిపాలిటీ కొత్తపల్లి నివాసి, అడ్వకేట్ దూడపాక శ్రీనివాస్‌కు తెలంగాణ ప్రభుత్వంచే ప్రతిష్టాత్మకమైన “దళిత రత్న” అవార్డు లభించింది. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ 2026 ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా ఈ పురస్కారాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డా. చంద్రశేఖర్, టీపీసీసీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు డా. రామకృష్ణ, ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షురాలు రోజారాణి చేతుల మీదుగా శ్రీనివాస్‌కు అవార్డు ప్రదానం చేశారు.
అంబేద్కర్ ఆశయ సాధనతో ముందుకు సాగుతూ న్యాయవిద్యను అభ్యసించి, సమాజానికి న్యాయ సేవలు అందిస్తున్నందుకు, అలాగే “చేయూత ఫౌండేషన్” స్వచ్ఛంద సంస్థ ద్వారా కరోనా సమయంలో చేసిన విశేష సేవలకు గాను ఈ అవార్డు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా అవార్డు అందుకున్న దూడపాక శ్రీనివాస్ ఉత్సవ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజ సేవను మరింత విస్తరించి ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments