బలహీనతలకు బ్రేక్… ‘బాల భరోసా’తో చిన్నారుల ఆరోగ్యానికి గట్టి అండ

బలహీనతలకు బ్రేక్… ‘బాల భరోసా’తో చిన్నారుల ఆరోగ్యానికి గట్టి అండ

హుజూరాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):
 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99లో భాగంగా హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘బాల భరోసా’ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని ఘనంగా ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్య సమస్యలకు సమగ్ర పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు.
RBSK ద్వారా వైద్యపరమైన లోపాలు గుర్తించిన 23 మంది పిల్లలకు నిపుణుడు డాక్టర్ నవీన్ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు అవసరమైన చికిత్సలు అందించేందుకు వైద్య బృందం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణ రెడ్డి, డిప్యూటీ DMHO శ్రవణ్ కుమార్, డాక్టర్ తులసీదాస్, డాక్టర్ జరీనా, CDPO సుగుణతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు స్థానికులు అభినందనలు తెలిపారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .