ధోతీ కార్యక్రమానికి హాజరైన జిల్లెల ఆదిత్య రెడ్డి.
Views: 6
On
వనపర్తి,ఏప్రిల్30(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తిలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్‌లో చీర్ల జనార్ధన్ సాగర్ కుమారుల ధోతీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఏఐపీసీ అధ్యక్షుడు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి హాజరై కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.చిన్నారులను ఆశీర్వదించి కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో కొనసాగగా పలువురు రాజకీయ, సామాజిక నాయకులు పాల్గొని కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా సంప్రదాయ వేడుకలు కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తాయని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, విద్యార్థి కాంగ్రెస్ నాయకుడు చరణ్, పాతపల్లి అనిల్, సురేష్, మాజీ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పండు సాగర్, కార్మిక సంఘ నాయకుడు మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments