మహాకవి శ్రీశ్రీ అభ్యుదయ సాహిత్యానికి దిక్సూచి.
పలుస శంకర్ గౌడ్.
Views: 4
On
వనపర్తి,ఏప్రిల్30(తెలంగాణ ముచ్చట్లు):
తెలుగు సాహిత్య చరిత్రలో అభ్యుదయ నినాదంగా నిలిచిన మహాకవి శ్రీశ్రీ సాహిత్య ప్రపంచానికి చిరస్థాయిగా సేవలందించారని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో స్థానిక రేడియంట్ హై స్కూల్‌లో మహాకవి శ్రీశ్రీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శంకర్ గౌడ్ మాట్లాడుతూ, ప్రాంతాలకు అతీతంగా తెలుగు కవులు, సాహిత్యాభిమానుల మనసుల్లో శ్రీశ్రీ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ఆయన కవిత్వం అనేక మందిని ప్రభావితం చేసిందని, ఆయన అనుసరించిన అభ్యుదయ కవితా మార్గంలో ఎన్నో గొప్ప రచనలు వెలువడ్డాయని వివరించారు.సామాజిక చైతన్యంతో కూడిన కవిత్వంతో పాటు సాహిత్య విలువలతో నిండిన సినిమా పాటలను కూడా శ్రీశ్రీ రచించారని, తెలుగు కవితా వైతాళికుడిగా ఆయన చిరస్మరణీయుడిగా నిలిచారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళా వేదిక ప్రతినిధులు, కవులు కందూరు నారాయణ రెడ్డి, బైరోజు చంద్రశేఖర్, గాయకుడు ఎం.ఏ. సత్తారు, బండారు శ్రీనివాస్, దేశి రాములు యాదవ్, బుచ్చిబాబు, భాస్కర్, ఉప్పరి తిరుమలేశు, స్టీఫెన్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments