ప్రజల గర్జనతో కంపిస్తున్న హుజురాబాద్ .

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా 39వ రోజు దీక్ష జోష్ .

 ప్రజల గర్జనతో కంపిస్తున్న హుజురాబాద్ .

హుజురాబాద్ ఏప్రిల్ 30(తెలంగాణ ముచ్చట్లు ):

హుజురాబాద్ శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్ష 39వ రోజుకు చేరుకుంది. రోజురోజుకు ప్రజల మద్దతు పెరుగుతూ ఉద్యమం మరింత ఉధృతంగా మారుతోంది.
ఈ నిరసనకు సంఘీభావంగా హుజురాబాద్ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు డంపింగ్ యార్డ్‌ను తక్షణమే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
అనంతరం నిరాహార దీక్ష శిబిరానికి చేరుకుని నిరసనకారులకు మద్దతు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారి, ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .