హుజురాబాద్‌లో హాకీ జోష్ – వేసవి శిబిరంతో యువతకు సువర్ణావకాశం.

హుజురాబాద్‌లో హాకీ జోష్ – వేసవి శిబిరంతో యువతకు సువర్ణావకాశం.

హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):
 
వేసవిలో నిర్వహిస్తున్న హాకీ శిక్షణ శిబిరాన్ని యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని హాకీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం వేసవి హాకీ శిక్షణ శిబిరాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, క్లబ్ సెక్రటరీ బొడిగె తిరుపతి గౌడ్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హాకీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. వేసవి శిబిరం ద్వారా మౌలిక నైపుణ్యాలు పెంపొందించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని సూచించారు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెరగడమే కాకుండా శారీరక దృఢత్వం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ శిబిరంలో పాల్గొనే వారికి పూర్తి స్థాయి ఉచిత శిక్షణ అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు భూసారపు శంకర్, సీనియర్ క్రీడాకారులు గుడ్డెలుగుల సమ్మయ్య, వేముల రవికుమార్, శ్యాంసుందర్, సజ్జు, యూసుఫ్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రాజు, రాజేష్, సాయి కృష్ణ, కోచ్ విక్రమ్, సాంబరాజు, వినయ్ వంశీతో పాటు సీనియర్, జూనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

పెద్దమందడిలో ఘనంగా మేడే వేడుకలు. పెద్దమందడిలో ఘనంగా మేడే వేడుకలు.
పెద్దమందడి,మే01( తెలంగాణ ముచ్చట్లు):   వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో గురువారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు...
శ్రామిక శక్తి అవార్డు అందుకున్న దయ్యాల దాసు.
ప్రపంచానికి శాంతి సందేశం బుద్ధుడు.
హుజురాబాద్‌లో హాకీ జోష్ – వేసవి శిబిరంతో యువతకు సువర్ణావకాశం.
బలహీనతలకు బ్రేక్… ‘బాల భరోసా’తో చిన్నారుల ఆరోగ్యానికి గట్టి అండ
వడదెబ్బతో మహిళ మృతి – కుటుంబంలో విషాదం .
హుజురాబాద్‌లో మే డే సంబరాలు ఘనంగా – కార్మికుల ఐక్యతకు గళం .