హుజురాబాద్‌లో మే డే సంబరాలు ఘనంగా – కార్మికుల ఐక్యతకు గళం .
Views: 6
On
హుజురాబాద్, మే 01(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణంలోని రైస్ మిల్లు కార్మికుల ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లుల కార్మిక సంఘం అధ్యక్షుడు ప్రతాప శ్రీనివాస్ జెండాను ఆవిష్కరించారు.
కార్మికులు “కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం పరస్పరం స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి సంపత్ రెడ్డి, నాయకులు సారంగపాణి, కుమార్, సురేష్, నాగరాజు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments