పెద్దమందడిలో ఘనంగా మేడే వేడుకలు.
Views: 5
On
పెద్దమందడి,మే01( తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో గురువారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కార్మికులు, మహిళలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎర్రజెండాను ఆవిష్కరించి కార్మిక అమరవీరులకు నివాళులర్పించారు.అనంతరం మాట్లాడిన నాయకులు ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని, కార్మికుల కృషితోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.పారిశుద్ధ కార్మికుల మండల అధ్యక్షురాలు ఘట్టమ్మ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత కృషి చేయాలని కోరారు. పారిశుద్ధ కార్మికులకు తగిన వేతనాలు, భద్రతా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పారిశుద్ధ కార్మికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments