శ్రామిక శక్తి అవార్డు అందుకున్న దయ్యాల దాసు.

శ్రామిక శక్తి అవార్డు అందుకున్న దయ్యాల దాసు.

వనపర్తి,మే01(తెలంగాణ ముచ్చట్లు)
 
అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామానికి చెందిన తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి దయ్యాల దాసుకు శ్రామిక శక్తి అవార్డు ప్రదానం చేశారు.టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు.ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లు, కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం దయ్యాల దాసు ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.ముఖ్యంగా కార్మికులకు బీమా, ఆరోగ్య సదుపాయాలు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలు వంటి అంశాలపై ఆయన చేస్తున్న కృషిని పలువురు నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా దయ్యాల దాసు మాట్లాడుతూ.. కార్మికుల సేవలో తనకు వచ్చిన ఈ గౌరవం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని, ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు.కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేస్తానని, శ్రమజీవుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని దయ్యాల దాసును అభినందించారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .