అంబాల వెంకటేశ్వర్లకు దళిత రత్న పురస్కారం.
Views: 2
On
ఎల్కతుర్తి, ఏప్రిల్ 30( తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామానికి చెందిన అంబాల వెంకటేశ్వర్లకు అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ప్రతిష్టాత్మకమైన “దళిత రత్న” పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్ర బారతిలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా వెంకటేశ్వర్లు అవార్డును స్వీకరించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తనకు ఈ గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామస్థుల అభిమానం, తన సేవలను గుర్తించి ఈ పురస్కారం అందించడం గర్వకారణమని తెలిపారు. ఒక కళాకారునిగా గ్రామంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు రావడం తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు.
గ్రామంలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ కలిసి ఈ సంతోషాన్ని పంచుకోవడం విశేషమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి గౌరవం దక్కడం తనకు మరింత ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, పల్భాపూర్ గ్రామ ప్రజలు వెంకటేశ్వర్లకు “దళిత రత్న” అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
01 May 2026 18:32:58
హుజురాబాద్,మే 01(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లీ 14వ వార్డుకు చెందిన సటికం సారయ్య గారి తల్లి సటికం నర్సమ్మ గారు వడదెబ్బకు గురై ఈ...


Comments