ప్రపంచానికి శాంతి సందేశం బుద్ధుడు.

ప్రపంచానికి శాంతి సందేశం బుద్ధుడు.

హుజురాబాద్‌లో ఘన నివాళి
బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జయంతి
అహింస మార్గం పాటించలని పిలుపు
 
హుజురాబాద్, మే 1(తెలంగాణ ముచ్చట్లు ):
 
ప్రపంచ శాంతికాముకుడు గౌతమ బుద్ధుని 2570వ జయంతిని బీసీ జేఏసీ హుజురాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద జరిగిన కార్యక్రమానికి అధ్యక్షుడు సందేల వెంకన్న నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, గౌతమ బుద్ధుడు రాజవంశంలో జన్మించి భోగభాగ్యాలను త్యజించి మానవాళి శ్రేయస్సు కోసం సన్యాసం స్వీకరించారని తెలిపారు. దుఃఖరహిత సమాజ నిర్మాణం కోసం ఆయన చూపిన మార్గం ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు.
మనిషి తన కోరికలను అదుపులో ఉంచుకున్నప్పుడే నిజమైన ఆనందాన్ని పొందగలడని, ధ్యానం ద్వారా మానసిక వికాసం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమాజంలోని అజ్ఞానాన్ని తొలగించి ప్రజలను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో బుద్ధుని బోధనలు కీలకమని తెలిపారు.
ప్రజలు బుద్ధుడి బాటలో నడుచుకుని సత్యం, ధర్మం, అహింస మార్గాలను అనుసరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, సిర్సపల్లి సర్పంచ్ పుల్సాని రామారావు, ఉప సర్పంచ్ల ఫోరం కన్వీనర్ వన్నాల శివాజీ, పుల్కల్ ఈశ్వర్ రెడ్డి, ఇప్పకాయల సాగర్, రవీందర్, కొలిపాక సమ్మయ్య, సబ్బని రాజేందర్, మాము నూరి ప్రవీణ్ కుమార్, కోట భాస్కర్, ఎండి బాబర్, గరవేణి శ్రీకాంత్, కొలిపాక క్రాంతి కుమార్, తూముల శ్రీకాంత్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .