ప్రజల సమస్యలపై అసెంబ్లీలో హాట్ టాపిక్.
కౌశిక్ రెడ్డి డిమాండ్లు.
Views: 5
On
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ హాల్‌లో జరిగిన ఇందిరమ్మ ఇళ్లు, 2BHK గృహాలు మరియు రెవెన్యూ అంశాలపై సమీక్షా సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని పలు కీలక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తూ పలు అంశాలపై స్పష్టమైన డిమాండ్లు చేశారు.
జమ్మికుంట, ధర్మారం, ఇల్లంతకుంట, కమలాపూర్, వీణవంక మండలాల్లో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 2BHK ఇళ్లను ఆలస్యం చేయకుండా వెంటనే పేదలకు కేటాయించాలని ఆయన కోరారు. అలాగే చిన్నకోమటిపల్లి, పోతిరెడ్డిపేట, విలాసాగర్ ప్రాంతాల్లో ఆగిపోయిన గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రెవెన్యూ అంశాలపై మాట్లాడుతూ హుజురాబాద్ పట్టణంలో ప్రెస్ సభ్యులకు ఇచ్చిన పట్టాలను నిలిపివేయడం అన్యాయమని పేర్కొంటూ వెంటనే మంజూరు చేయాలని కోరారు. జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలోని పేదలకు పట్టాలు తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన భూమిని దేవాదాయ శాఖకు అప్పగించాలని సూచించారు.
హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని మంత్రి వర్గానికి వినతి పత్రం సమర్పించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇల్లంతకుంట మండలంలో MRO, MPDO కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ భవనాలు లేనందున వెంటనే నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. వీణవంక మండలంలో కాల్వలు తెగిపోవడం వల్ల సుమారు 8000 ఎకరాల సాగు భూమికి, తాగునీటి అవసరాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొంటూ 70 కోట్ల రూపాయల ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ ఇందిరమ్మ ఇళ్లు మరియు 2BHK గృహాల కేటాయింపులో ఎమ్మెల్యే సూచనలకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments