పెద్దమందడిలో కాంగ్రెస్‌కు కొత్త ఊపు.

మండల అధ్యక్షుడిగా కొమ్ము వెంకటస్వామి నియామకం.

పెద్దమందడిలో కాంగ్రెస్‌కు కొత్త ఊపు.

వనపర్తి,మే27(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా  పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది.పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొమ్ము వెంకటస్వామిని పార్టీ అధిష్టానం నియమించింది.ఈ నియామకంతో మండల స్థాయిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే ఆశాభావం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది.పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకు చేరువైన నాయకుడిగా గుర్తింపు పొందిన కొమ్ము వెంకటస్వామికి మండల అధ్యక్ష పదవి దక్కడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఆశయాలకు అనుగుణంగా మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేస్తానని స్పష్టం చేశారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కొమ్ము వెంకటస్వామికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు. ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు.
ఎల్కతుర్తి, మే 28 (తెలంగాణ ముచ్చట్లు): ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక...
తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళన కరపత్రాన్ని విడుదల చేసిన మోత్కుపల్లి .
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి.
బాల్క సుమన్‌పై ఫిర్యాదు.
ఉచిత ఆన్లైన్ విద్యను సద్వినియోగం చేసుకోండి - మాజీ ఎంపీ నామ.
ఎన్టీఆర్ జననమే ఒక చరిత్ర : మాజీ ఎంపీ నామ.