బక్రీద్ వేళ సామరస్య సందేశం.. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్.

బక్రీద్ వేళ సామరస్య సందేశం.. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్.

హుజురాబాద్, మే 28 (తెలంగాణ ముచ్చట్లు):

హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం మైనారిటీ కమిటీ అధ్యక్షుడు ఎండినూరుల్లా ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు మాట్లాడుతూ, బక్రీద్ సందర్భంగా గోవు వధకు దూరంగా ఉండాలని, హిందువుల మనోభావాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
అలాగే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవ భావంతో కలిసి జీవించాలని, శాంతి సామరస్యాల పరిరక్షణకు ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ముస్లిం మైనారిటీ సభ్యులు, యువకులు పాల్గొని సామరస్య సందేశాన్ని చాటారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .