సత్తుపల్లి–హైదరాబాద్‌కు లహరి బస్సు సేవలు.
సూపర్ లగ్జరీ చార్జీతో నాన్‌ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సౌకర్యం.
సత్తుపల్లి, మే 18(తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి నుండి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుండి సత్తుపల్లికి ప్రయాణికుల సౌకర్యార్థం లహరి నాన్‌ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ గురజాల లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన వివరాలు వెల్లడించారు. సత్తుపల్లి నుండి హైదరాబాద్‌కు 8885 సర్వీస్ నంబర్‌తో ప్రతి రోజు రాత్రి 11:15 గంటలకు బస్సు బయలుదేరుతుందని తెలిపారు. అలాగే హైదరాబాద్ బీహెచ్ఈఎల్ నుండి సత్తుపల్లికి 8886 సర్వీస్ నంబర్‌తో రాత్రి 9 గంటలకు బస్సు నడుస్తుందని పేర్కొన్నారు. ఈ బస్సులో సూపర్ లగ్జరీ చార్జీతో ప్రయాణించే అవకాశం కల్పించినట్లు చెప్పారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సత్తుపల్లి–బీహెచ్ఈఎల్ మార్గంలో ఏసీ రాజధాని బస్సులను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సత్తుపల్లి నుండి బీహెచ్ఈఎల్‌కు ఉదయం 7:45, 9:15, 10:00 గంటలకు, రాత్రి 9:00, 9:45, 10:30 గంటలకు బస్సులు నడుస్తాయని చెప్పారు. అదేవిధంగా బీహెచ్ఈఎల్ నుండి సత్తుపల్లికి ఉదయం 8:00, 9:00, 10:00 గంటలకు, రాత్రి 9:00, 10:00, 11:00 గంటలకు ఏసీ బస్సు సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ కోరారు.


Comments