గడ్డి కట్టే యంత్రంలో చిక్కుకుని వ్యక్తి దుర్మరణం.

గడ్డి కట్టే యంత్రంలో చిక్కుకుని వ్యక్తి దుర్మరణం.

భీమదేవరపల్లి,ఏప్రిల్ 6(తెలంగాణ ముచ్చట్లు)

భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రచ్చ సంపత్ (51) గడ్డి కట్టలు కట్టే యంత్రం (బేలర్‌ మెషిన్‌)లో పని చేస్తుండగా ఈరోజు మధ్యాహ్నం సుమారు 12:30 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు యంత్రంలో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యంత్రంలో పనిచేసేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడం లేదా సాంకేతిక లోపం కారణమా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.

ఈ దుర్ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుడికి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీటి నివాళులు అర్పించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .