యువతకు గోల్డెన్ ఛాన్స్… హ్యాండ్‌బాల్ సమ్మర్ క్యాంప్ ప్రారంభం!
Views: 3
On
జమ్మికుంట టౌన్ మే 04 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని కోరపల్లి సర్పంచ్ మధుసూదన్, ఉప సర్పంచ్ రాజు యాదవ్, గ్రామపంచాయతీ కార్యదర్శి కె. తారక రామారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మరియు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి జి. శ్రీను మాట్లాడుతూ, మే 1 నుంచి 31 వరకు జరిగే ఈ శిబిరంలో 10 నుంచి 16 సంవత్సరాల మధ్య వయస్సు గల బాల బాలికలు పాల్గొనవచ్చని తెలిపారు.
ఉప సర్పంచ్ రాజు యాదవ్ మాట్లాడుతూ, కోరపల్లి గ్రామంతో పాటు సమీప గ్రామాల విద్యార్థులు ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. మంచి ప్రదర్శనతో రాష్ట్ర, జాతీయ స్థాయిలకు ఎంపికై గ్రామానికి, జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అలాగే శిబిరంలో పాల్గొనే విద్యార్థులకు టీషర్ట్స్, షార్ట్‌లు అందజేయనున్నట్లు సర్పంచ్ మధుసూదన్ తెలిపారు. గ్రామపంచాయతీ కార్యదర్శి కె. తారక రామారావు మాట్లాడుతూ, క్రీడాకారులకు విద్య, ఉద్యోగాల్లో 2 శాతం స్పోర్ట్స్ కోటా ఉన్నందున దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు జాతీయ స్థాయి క్రీడాకారులు చక్రధర్, హరి ప్రసాద్ పాల్గొన్నారు.

Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 May 2026 17:01:04
ఎల్కతుర్తి, మే 5( తెలంగాణ ముచ్చట్లు):
ప్రజాపాలన ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా దండేపల్లి గ్రామంలో నిర్వహించిన “రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం రైతుల్లో కొత్త...


Comments