వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన.

ధాన్యాన్ని త్వరగా ఆరబెట్టి మిల్లులకు తరలించాలి
 
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
 
 మంచిర్యాల.మే 4(తెలంగాణ ముచ్చట్లు)
 
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సోమవారం మందమర్రి మండలంలోని సారంగపల్లి, బొక్కలగుట్ట ప్రాంతాలలోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించి తడిసిన దాన్యాన్ని ఆరబెట్టి త్వరగా మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు,  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి మద్దతు ధర చెల్లించి వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు, ఇటీవల కురిసిన వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టి కేటాయించిన మిల్లులకు త్వరగా తరలించాలని నిర్వాహకులకు సూచించారు, ప్రభుత్వం చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు, రైతులు ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, నీడ, తూకం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు కల్పించాలని తెలిపారు, రైతు యొక్క వివరాలను సిస్టం లో నమోదు చేసి ఆధార్ కార్డు ద్వారా వారి గుర్తింపును దృవీకరించాలని, రైతు భూమి విస్తీర్ణం, పండించిన ధాన్యం వివరాలను సరి చూడాలని, ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే విధంగా పరిశీలించాలని తెలిపారు, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .