పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్.!
Views: 52
On
- ఏప్రిల్‌కు ఎఫ్‌ఎఫ్‌బీ ధర రూ.23,501గా ఖరారు.
- మంత్రి తుమ్మలకు రైతుల కృతజ్ఞతలు.
అశ్వారావుపేట, మే 2 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్రంలో ఆయిల్ పామ్ రైతులకు ఊరటనిచ్చే విధంగా గెలల టన్ను ధరను ఓఈఆర్ 20.01 శాతాన్ని ఆధారంగా రూ.23,501గా నిర్ణయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలసి రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ, ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధర నిర్ణయంలో తీసుకున్న నిర్ణయం రైతులకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుందన్నారు. ముఖ్యంగా ఓఈఆర్ శాతాన్ని పెంచి ధర నిర్ణయించడం వల్ల రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తోందని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న ఈ విధానాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆయిల్ పామ్ గెలల ధరను నిర్ణయించడం పట్ల అక్కడి రైతుల్లో ఆనందం నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓఈఆర్ 18 శాతం ఉండగా, తెలంగాణలో 20.01 శాతం ఉండటంతో ధరలు పెరగడం రైతులకు లాభదాయకంగా మారిందని రైతు సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. తెలంగాణ విధానం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ధరలు పెరగడం రైతులకు అనుకూల పరిస్థితులను సృష్టించిందని తెలిపారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ పామ్ సాగును విస్తరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆలపాటికి వివరించారు. సాగు విస్తీర్ణం పెంపుతో పాటు రైతులకు అవసరమైన సాంకేతిక సహాయం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల గెలల టన్ను ధర రూ.23,501గా నిర్ణయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం తమకు ఆర్థిక భరోసాను కల్పించిందని, భవిష్యత్తులో ఇంకా ప్రోత్సాహక చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 May 2026 22:23:47
హుజురాబాద్, మే 2(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణానికి సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని వేస్ట్...


Comments