ప్రపంచ కార్మికులారా ఏకంకండి నినాదాలతో మేడే.

ప్రపంచ కార్మికులారా ఏకంకండి నినాదాలతో మేడే.

ఎల్కతుర్తి, మే 01(తెలంగాణ ముచ్చట్లు):
 
ఎల్కతుర్తి మండలంలోని గోపాల్పూర్, కేశవాపూర్, బావుపేట్, పెంచికల్పేట్ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ మరియు దామర గ్రామంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు వేర్వేరు కార్యక్రమాల ద్వారా కార్మికుల ఐక్యతను ప్రదర్శించాయి.
సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక హక్కుల కోసం పోరాడి అమరులైన కార్మికులకు ఘన నివాళులు అర్పించారు. ముఖ్య అతిథి కామ్రేడ్ ఊట్కూరు రాములు మాట్లాడుతూ కార్మిక–రైతు ఐక్యతతో హక్కుల సాధనకు నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక చట్టాల మెరుగుదల, రైతుల సంక్షేమం కోసం సిపిఐ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి శనిగరపు రాజకుమార్ జెండా ఆవిష్కరించారు.
దామర గ్రామంలో నిర్వహించిన మేడే వేడుకల్లో బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఎగురవేశారు. దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి, వారి హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో అవగాహన ర్యాలీలు, సమావేశాలు నిర్వహించి కార్మిక సంక్షేమం, కనీస వేతనాలు, పనిఘంటల నియంత్రణపై చర్చించారు. కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా “ప్రపంచ కార్మికులారా ఏకంకండి” నినాదాలతో మేడే అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.IMG-20260501-WA0120 వివిధ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం.
పెద్దమందడి,మే01(తెలంగాణ ముచ్చట్లు):   వనపర్తి జిల్లాలో  రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోందని బీజేపీ నాయకుడు కిషన్ నాయక్ విమర్శించారు.శుక్రవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరయ్యపల్లి గ్రామంలోని...
వేలేరు మండల కేంద్రంలో ఘనంగా మే డే వేడుకలు.
ప్రపంచ కార్మికులారా ఏకంకండి నినాదాలతో మేడే.
గుడిసెలు లేని గ్రామాలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
పెద్దమందడిలో ఘనంగా మేడే వేడుకలు.
శ్రామిక శక్తి అవార్డు అందుకున్న దయ్యాల దాసు.
ప్రపంచానికి శాంతి సందేశం బుద్ధుడు.