వేలేరు మండల కేంద్రంలో ఘనంగా మే డే వేడుకలు.

వేలేరు మండల కేంద్రంలో ఘనంగా మే డే వేడుకలు.

వేలేరు, మే 01 (తెలంగాణ ముచ్చట్లు):
 
వేలేరు మండల కేంద్రంలో మే డే సందర్భంగా భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు కర్ణాకర్ మరియు హామలి సంఘం అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిల్లా యాదగిరి, వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
“శ్రామికుడు లేనిదే ప్రపంచం లేదు” అని పేర్కొంటూ, వేలేరు మండల కేంద్రంలోని కార్మికులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, వివిధ కార్మిక సంఘాల నాయకులు రమేష్, ప్రభాకర్, సంపత్, సాంబయ్య, భాస్కర్, సాంబరాజు, వీరయ్య, చంద్రయ్య, రాజు, కొమరయ్యకోటి, కుమార్ తదితరులు పాల్గొన్నారుIMG-20260501-WA0125
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .